
తీవ్ర అనారోగ్యం కారణంగా... నటి జయప్రద సోదరుడు రాజబాబు... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెబుతున్నారు. శ్వాస కోశ వ్యాధి కారణంగానే.... నటి జయప్రద సోదరుడు రాజబాబు... చనిపోయినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఎమోషనల్ పోస్టు పెట్టారు నటి జయప్రద. తన సోదరుడు రాజబాబు మరణించారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని నివాసంలో రాజబాబు నిన్న సాయంత్రం మరణించినట్లు... స్వయంగా ప్రకటించారు జయప్రద.
అంతేకాదు తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది. ఇక ఇవాళ సాయంత్రం హైదరాబాదులోని రాజబాబు అంతక్రియలు జరగబోతున్నట్లు చెబుతున్నారు. ఇక నటి జయప్రద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. రాజబాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ నే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేసింది నటి జయప్రద.
ఇప్పుడు రష్మిక మందన అలాగే సమంత కంటే ఎక్కువ పాపులారిటీ అప్పట్లోనే తెచ్చుకుంది. వందల సంఖ్యలో సినిమాలు చేసి ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తోంది. 1994లో సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగానికి ఆమె అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు. అంతేకాదు 1996లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు కూడా ఎన్నిక కావడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి సమాజ్వాది పార్టీలో చేరిపోయారు.