బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'చావా' సినిమా భారీగా కలెక్షన్స్ సాధిస్తూ రికార్డు క్రియేట్ చేస్తుంది.. ఈ సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయిల భారీ టార్గెట్ ని అధిగమించి 500 కోట్ల రూపాయల భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది..ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శంభాజీ మహారాజ్ గా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు.. నార్త్ ఆడియన్స్సినిమా చూసేందుకు థియేటర్ వద్ద క్యూ కడుతున్నారు.. అయితే ఈ సినిమాను తెలుగులో చూడాలని టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

తెలుగు ప్రేక్షకులకి మొదటి నుండి చారిత్రక నేపథ్యం లో వచ్చే సినిమాలంటే అమితాసక్తి ఉంది.ఛావా మూవీకి అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని రావడంతో తెలుగు లో కూడా డబ్ చేయమని ఆ చిత్ర నిర్మాతలను తెలుగు ప్రేక్షకులు  పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసారు. తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై వున్న అమితాసక్తిని గమనించిన గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వెంటనే ఛావా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసేసారు.మార్చి 7న ‘ఛావా’ తెలుగు వెర్షన్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయిందని సమాచారం. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది..

ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఛావా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ పది కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. విక్కీ కౌశల్ మన తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోయిన ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే మాములు విషయం కాదు. తెలుగులో ఈ సినిమా ప్రమోషన్స్ కి  హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ లక్ష్మణ్ పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: