బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్.. గురించి ఆయన ఆస్తులు, లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈయన ఆస్తి విలువ 7,300 కోట్ల రూపాయలు ఉందని దేశంలోనే ధనిక స్టార్ హీరోగా వెలుగుతున్నారు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, కుమారుడు కుమార్తెతో కలిసి ప్రస్తుతం మన్నత్ ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఇంటిని వదిలి అద్దె ఇంట్లోకి వెళుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం విన్న అభిమానులకు షాక్ గురిచేసిన మరి అసలు విషయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.


 అంతటి ఆస్తిపరుడైన షారుఖ్ ఖాన్ సొంత ఇంటిని వదిలేస్తున్నారా అనే విషయం ఇప్పుడు అందరిని డైలమాలో పడేలా చేసింది. ముంబైలో ఉండే మన్నత్ కేవలం ఒక ఇల్లు కాదు.. అభిమానులు దేవాలయంగా భావిస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఈ మన్నత్ బంగ్లాని విడిచిపెట్టబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. షారుఖ్ ఖాన్ తన బాల్కనీలో అభిమానులను పలకరించడానికి అడుగు పెట్టినప్పుడు అక్కడ ఒక మ్యాజిక్ ఫోర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఫ్రైడే ఫ్యాన్స్ మీట్ ఆచారాన్ని సైతం కొనసాగిస్తూ ఉన్నారు షారుక్ ఖాన్.కారణం ఏంటన్నది తెలియదు కానీ షారుక్ ఖాన్ తన ఇంటిని వదిలి వెళుతున్నారని విషయం వైరల్ గా మారుతున్నది.


అయితే మన్నత్ ను షారుక్ ఖాన్ వదిలి వెళ్లబోడంటూ తన స్నేహితులు తెలియజేస్తున్నారట. మరి అసలు విషయం ఏంటన్నది షారుఖ్ ఖాన్ స్పందిస్తే అభిమానులు కొంతమేరకు ఊపిరి పీల్చుకుంటారని చెప్పవచ్చు. షారుక్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాను పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను రిలీజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ చివరిగా 2023లో ఢంకి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. తదుపరిచిత్రం పఠాన్ 2 సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: