
నందమూరి కళ్యాణ్రామ్ అటు హీరోగాను ఇటు నిర్మాత గాను బిజీబిజీగా కొనసాగుతున్నారు. ఓ వైపు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ హీరోగా కాస్త గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ఓ మంచి క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ల తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది. ఈ సినిమా కు మేకర్లు రుద్ర అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్తో కళ్యాణ్ రామ్ మూవీ వస్తూ ఉండడంతో నందమూరి అభిమానుల తో పాటు తెలుగు సినిమా అభిమానుల లో అంచనాల మామూలుగా లేవు.
ఈ సినిమాలో టాలీవుడ్ లేడీ అమితాబచ్చన్ .. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ ముద్దు గుమ్మ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. రుద్ర అనే టైటిల్ తో ప్రేక్షకులు ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు చేసిన కళ్యాణ్ రామ్ ఎలాంటి హిట్టు కొడతారో చూడాలి. కళ్యాణ్ రామ్ కు గత పదేళ్లలో పటాస్ ఆ తర్వాత 118 .. ఆ తర్వత బింబిసార లాంటి హిట్లు మాత్రమే పడ్డాయి. ఈ సారి ఒక్క హిట్ పడితే కొన్నేళ్ల పాటు కళ్యాణ్ రామ్ కెరీర్ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఏం జరుగుతుం దో ? చూద్దాం.