
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాల లో నటిస్తూ వరుస సినిమాలను రిలీజ్ కు రెడీ చేశాడు. ఇప్పటికే దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు చిత్ర రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు నటిస్తున్న తమ్ముడు సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. తమ్ముడు సినిమా ను తొలుత మహా శివరాత్రి కానుక గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు వాయిదా పడటంతో పాటు మూవీ రిలీజ్ కూడా వాయిదా పడింది. తమ్ముడు సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చిన ఓ సెంటిమెంటల్ డేట్ ను లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. తమ్ముడు సినిమాలో మే 9న రిలీజ్ చేసినందుకు చిత్రకు ప్రయత్నిస్తోంది. ఈ తేదీన రిలీజ్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
జగదేకవీరుడు అతిలోక సుందరి - గ్యాంగ్ లీడర్ - మహానటి - మహర్షి లాంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టాయి. మరి నిజంగానే తమ్ముడు సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక కొద్ది రోజులు గా నితిన్ కు సరైన హిట్ లేదు. ఒక్క టంటే ఒక్క హిట్ కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు. ఈ టైంలో రెండు క్రేజీ బ్యానర్ల లో రెండు క్రేజీ ప్రాజెక్టులు నితిన్ చేస్తున్నాడు. ఈ రెండు హిట్ కొడితే నితిన్ కెరీర్ కు ఇప్పట్లో తిరుగు ఉండదనే చెప్పాలి.