-  ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ హిట్ - 3 ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిటింగ్ లో ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాని సినిమా వ‌స్తుందంటే చాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మినిమం అంచ‌నాలు ఉంటాయి. ఈ 15 ఏళ్ల లో నాని సినిమాలు కొని మేం న‌ష్ట‌పోయాం అన్న డిస్ట్రిబ్యూట‌ర్లు కాని .. ఎగ్జిబిట‌ర్లు కాని ఒక్క‌రు కూడా లేరు అంటే నాని రేంజ్ ఏ స్థాయిలో ఉందో .. నాని సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఏ స్థాయి క్రేజ్ ఉందో తెలుస్తోంది. ఇక హిట్ 3 సినిమా విష‌యానికి వ‌స్తే ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా కంప్లీట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు ముస్తాబు అవుతోంది.


ఇక హిట్ 3 సినిమా ను వేసవి కానుకగా మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు సిద్ధం అవుతున్నారు. అయితే నాని కి వేసవి కష్టాలు తప్పేలా లేవు. నాని సినిమాతో పోటీ పడేందుకు మరో రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా సిద్ధం అవుతున్నాయి. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘ కన్నప్ప ’ పాన్ ఇండియా సినిమా ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అలాగే తమిళ సీనియ‌ర్ .. స్టార్‌ హీరో సూర్య నటిస్తున్న ‘ రెట్రో ’ సినిమా కూడా మే 1న రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ రెండు సినిమా లు ప్ర‌భావం నాని హిట్ 3 సినిమా మీద గ‌ట్టిగానే ప్ర‌భావం చూపుతుంద‌న్న టాక్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. మరి ఈ రెండు సినిమాలు నాని హిట్ పరంపరకు ఎంతమాత్రం ప్రభావం చూపిస్తాయో రిలీజ్ అయ్యాక కాని తేలేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: