
క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అంటూ జనాలకు టోకరా చేశారట. ఈ తరుణంలోనే పుదుచ్చేరిలో... ప్రమోటర్లుగా ఉన్న హీరోయిన్ కాజల్ అలాగే తమన్నా లపై కేసు నమోదు అయింది. అధిక లాభాలు ఆశ చూపి పదిమంది నుంచి సుమారు 2.40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్న, అలాగే హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను విచారించనున్నారు పోలీసులు.
గతంలోనే ఇద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు పుదుచ్చేరి పోలీసులు. అయితే ఈ కేసు తాజాగా తెరపైకి రావడంతో... హీరోయిన్లు కాజల్ అగర్వాల్ అలాగే తమన్నాను విచారించబోతున్నారు. ఇది ఇలా ఉండగా... గత కొన్ని రోజులుగా తెలుగులో ఈ ఇద్దరు హీరోయిన్లు కాజల్ అలాగే తమన్నా సినిమాలు తీయడం లేదు అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా చాలా బిజీ అయిపోయారు. ఆమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ఇప్పటికే ప్రేమిస్తున్న హీరోయిన్... తమన్నా అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. ఇటు హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తోంది. మొన్నటికి మొన్న తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ సినిమాలో మెరిసిన హీరోయిన్ కాజల్... తెలుగులో అవకాశాల కోసం చూస్తోంది. పెళ్లయిన తర్వాత చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు తగ్గించింది.