- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహ బాలకృష్ణ తాజాగా ఈ ఏడాది సంక్రాంతికి డాకూ మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అఖండతో మొదలు పెడితే వీరసింహారెడ్డి - భగవంత్‌ కేసరి ... తాజా గా డాకూ మహారాజ్‌ సినిమాతో బాలయ్య ఖాతా లో వరుసగా నాలుగో సూపర్ డూపర్ హిట్ పడింది. బాలయ్య కెరియర్ లోని అత్యధికంగా 180 కోట్ల వసూళ్లు రాబట్టిన డాకు మాహారాజ్‌ సినిమా తాజాగా నెట్ ఫిక్స్ లో సంచలన రికార్డులతో దూసుకుపోతోంది. ఈనెల 20వ తేదీ అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్  లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎనిమిది రోజులు పాటు నెంబర్ వన్ మూవీగా నిలిచింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కేవలం ఏడు రోజులు మాత్రమే నెంబర్ వన్ గా ఉంది.


డాకు మహారాజ్ ఇప్పటికే భారత్ తో పాటు పాకిస్తాన్ .. బంగ్లాదేశ్ .. ఖతర్ యూఏఈ దేశాలలో టాప్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది. మరో 13 దేశాలలో టాప్ టెన్ లో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్లో డాకు మహారాజ్ చూసిన జనాలు వేలం వెర్రిగా పదేపదే చూస్తున్నారు. అలాగే ఇండియాలో తమిళం .. మలయాళం .. కన్నడం .. హిందీలో ఈ సినిమా స్ట్రిమింగ్ అవుతోంది. అన్ని భాషలలో డాకూ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పుష్ప పార్ట్ 2 కేరళలో అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే మలయాళీలు డాకు మహారాజ్ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారు. అదిరిపోయే విజువల్ మాస్ట్ ఫీజు అని మాస్ స్క్రీన్ ప్రజెంట్ నెస్ట్ లెవెల్ లో ఉందని చెబుతున్నారు. అలాగే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే నాన్ ఇంగ్లీష్ సినిమాలో వరల్డ్ వైడ్ గా ఐదవ స్థానాన్ని డాకు మహారాజ్ ఆక్రమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: