
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని ఇప్పటికే రాజమౌళి ఓ మీడియా వేదికగా చెప్పుకు రావడం తెలిసిందే. ఈ క్రంమలోనే కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం మహేష్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడని వినికిడి. తన లుక్, మేకోవర్ కోసం మహేష్ చాలా కష్టపడుతున్నాడని టాక్. కాగా SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇక ఈ సినిమానుంచి ఏదైనా అప్డేట్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్న ఫాన్స్ కి నిరాశే ఎదురవుతోంది. చిత్ర యూనిట్ మహేష్ లుక్ ను హైడ్ చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘట్టమనేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఆ వీడియో మహేష్ బాబు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో కావడంతో అదే సినిమాలోని లుక్ కావచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. సదరు వీడియోలో మహేష్ బాబు లాంగ్ హెయిర్ లో, గడ్డంతో కనిపించాడు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బల్క్ గా మారుతున్నట్టు కనబడుతోంది. జిమ్ లో వర్కౌట్స్ చేసి బాడీని పెంచుతున్నారు. ఇకపోతే, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.