ఏంటి రాజమౌళికి నిజంగానే చేతబడి వస్తుందా.. క్షుద్ర పూజలు చేయించి ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జీవితాలను నాశనం చేశాడా..ఇంతకీ రాజమౌళి ఇతర డైరెక్టర్లపై క్షుద్ర పూజలు చేశాడు అనే దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. దిగ్గజ డైరెక్టర్ గా దర్శక ధీరుడుగా టాలీవుడ్ లో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ప్రపంచ దేశాల్లో తెలుగు సినిమాల గురించి మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి పై తాజాగా సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.శ్రీనివాసరావు అనే వ్యక్తి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు.రమని నేను రాజమౌళి ఇద్దరం ప్రేమించామని, మాది ఆర్య టు లాంటి ప్రేమ అని, రాజమౌళి కోసం నేను డ్రాప్ అయ్యాను అని, రాజమౌళి నన్ను చాలా టార్చర్ చేశాడని, నా చావుకు కారణం రమా రాజమౌళి అంటూ ఇలా సంచలన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే. 

అయితే ఆ వ్యక్తి చేసిన ఆరోపణలపై రాజమౌళి అభిమానులైతే చాలా ఫైర్ అవుతున్నారు.రాజమౌళి స్టార్డం ఓర్వలేకే ఇలా ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. మరి కొంతమందేమో అతనికి మతిస్థిమితం లేదని అంటున్నారు. అయితే ఈ ఆరోపణల్లో ఇంకో మాట కూడా చెప్పాడు. అదేంటంటే.. రాజమౌళి వివి వినాయక్, ఆర్జీవి,పూరి జగన్నాథ్, సుకుమార్ వంటి డైరెక్టర్లకు క్షుద్ర పూజలు, చేతబడి చేయించి వారందరూ సినిమా ఇండస్ట్రీలో ఎదగకుండా తాను ఒక్కడే ఎదిగేలా వారిపై చేతబడి చేయించారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.అయితే ఈ కామెంట్లపై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. చూస్తుంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు నిజమే కావచ్చు.

ఎందుకంటే ఇన్ని రోజులు మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్లు ఎందుకు హిట్ కావడం లేదు అని, ఈయన పేరు ప్రఖ్యాతలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించడం కోసమే ఆ డైరెక్టర్ పై చేతబడి చేయించారని అంటుంటే.. మరి కొంతమందేమో నిజంగా వారికి క్షుద్ర పూజలు చేయిస్తే సుకుమార్ అంత పెద్ద పుష్ప టు సినిమాకి ఎలా డైరెక్షన్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప టు కి పేరు వచ్చింది.అలాంటిది ఆయనపై క్షుద్ర పూజలు చేయిస్తే అలాంటి సినిమా ఎలా తీస్తారు అని మరికొంతమంది ఆ వ్యక్తిపై విరుచుకుపడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ క్లీన్ గా ఉండే రాజమౌళి సినీ కెరియర్ పై ఆ వ్యక్తి ఒక మచ్చ వేసారని చెప్పుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: