తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఉంటారు. వీరిద్దరూ కొన్ని సందర్భాలలో సినిమాల ద్వారా బాక్సా ఫీస్ దగ్గర పోటీ పడిన కూడా బయట మాత్రం అద్భుతమైన స్నేహితులు. అనేక సందర్భాలలో మీరు కలుస్తూ ఉంటారు. అలాగే తమ స్నేహం గురించి ఎన్నో సందర్భాలలో కూడా వీరు చెప్పారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి చేయాల్సిన ఓ మూవీ ని నాగార్జున చేశాడు. ఆ సినిమా ఏది ..? నాగార్జునమూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు అనేది తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున ఆఖరి పోరాటం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... రాఘవేందర్రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అశ్విని దత్ ఈ మూవీ ని నిర్మించాడు. ఇకపోతే మొదట అశ్విని దత్ , చిరంజీవి హీరో గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించాలి అని అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవి ని కలిసి ఈ కథను కూడా వివరించారట. చిరంజీవి కూడా ఆ కథ మొత్తం విని ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ ఆ తర్వాత సినిమా మొదలయ్యే సమయానికి చిరు వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో అశ్విని దత్ , రాఘవేందర్రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్గా ఈ మూవీ ని రూపొందించాడట. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలా చిరంజీవి చేయాల్సిన సినిమాలో నాగార్జున నటించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: