హాలీవుడ్ పాప్ సింగర్ కేటీ పెర్రీ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. పెర్రీ ఇంగ్లాండ్‌లోని లండన్‌లోని కామ్డెన్‌లో జన్మించారు. ఆమె తన తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత, ఆమె పూర్తిగా తన తల్లి వద్దనే పెరిగింది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు సిడ్నీలో నివాసం ఉంటోంది. ఆమె రాత్రికి రాత్రే సింగర్ కాలేదు. దానికోసం ఆమె ఎన్నో లెక్కలేని క్షణాలు శ్రమించి ప్రస్తుత స్థాయికి వచ్చింది. ఆమె మొదట ఆస్ట్రేలియన్ జెర్సీ ఫాబ్రిక్ ఉపయోగించి ఆస్ట్రేలియాలోనే దుస్తుల తయారు దుకాణాన్ని ప్రాంభించాలని అనుకుంది. ఆ తరువాత కాలంలో అంటే సరిగ్గా 2009లో, ఆమె సిడ్నీ శివారు ప్రాంతమైన మోస్మాన్‌లో కేటీ పెర్రీ స్టూడియోను ప్రారంభించింది. అక్కడినుండి ఆమె సంగీత ప్రపంచంలో ఓ వెలుగు వెలగడానికి చాలా శ్రమించింది. డార్క్ హౌస్, రోర్, ఫైర్ వర్క్, లాస్ట్ ఫ్రైడే నైట్, హాట్ అండ్ కోల్డ్, కాలిఫోర్నియా గర్ల్స్ వంటి ఆల్బమ్స్ ఆమె సంగీత కెరీర్లో ఉత్తమంగా నిలిచాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే... అంతరిక్షంలోకి తొలిసారిగా సింగర్ కేటి పెర్రి అడుగుపెట్టనున్నారు. ఆమెతో పాటుగా ఇద్దరు జర్నలిస్టులు అయినటువంటి లారెన్ సాంచెజ్, గేల్ కింగ్ అంతరిక్షయానం చేయనున్నారు. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఈ ఏడాది మార్చి తర్వాత బ్లూ ఆరిజిన్ ఎన్ఎస్-31 మిషన్ ద్వారా మొత్తం 6 మంది మహిళా క్రూ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోకి జర్నలిస్టులు వెళ్లడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ లిస్టులో మొత్తం సింగర్ కేటి పెర్రి, అమెరికన్ ఏరో స్పేస్ ఇంజనీర్ ఐషా బోయీ, పౌర హక్కుల కార్యకర్త అమండా న్యూయెయిన్, అమెరికా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కెరియానే ఫ్లైన్ ఉన్నారు.

కాగా, 1963లో రష్యా కాస్మోనాట్ వాలెంటీనా తెరిష్కోవా ఒంటరిగా స్పేస్‌లోకి ప్రయాణించిన సంగతి విదితమే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేవలం మహిళలే అంతరిక్షంలోకి అడుగుపెట్టనుండటంతో సర్వత్రా హర్షాతిరేఖాలు వినిపిస్తున్నాయి. జెఫ్ బెజోస్ కాబోయే భార్య, మాజీ న్యూస్ కరస్పాండెంట్ లారెన్ సాంచెజ్ ఈ మిషన్‌కు నేతృత్వం వహించనున్నారు. బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ రాకెట్ సబ్ ఆర్బిటల్ ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు. ఇక వీరు అంతరిక్షానికి సరిహద్దుగా గుర్తింపు పొందిన కర్మాన్ రేఖపై నుంచి భూమిని వీక్షించడమే కాకుండా, దాదాపు 4 నిమిషాల పాటు గ్రావిటీ లేని స్థితిని అనుభవించే అవకాశం వీరికుంటుంది. ఇది న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్‌కు 11వ మానవ సహిత ప్రయోగంగా నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: