టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ స్టార్ ఈమేజ్ కరిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరసలో ఉంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదిలేశాడు. అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇక పవన్ వదిలేసిన ఓ రెండు సినిమాలలో మహేష్ బాబు హీరో గా నటించాడు. ఆ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవి ..? అనే వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ ని మొదట పూరి జగన్నాథ్ , మహేష్ తో కాకుండా పవన్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వివరించాడట. కానీ ఈ కథను పవన్ రిజెక్ట్ చేశాడట. దానితో ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఈ కథతో మహేష్ బాబును సంప్రదించాడట. ఈ కథకు మహేష్ ఓకే చెప్పడంతో పూరి జగన్నాథ్ , మహేష్ తో పోకిరి మూవీ ని రూపొందించాడట. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మహేష్ హీరో గా రూపొంది మంచి విజయం సాధించిన సినిమాల్లో అతడు మూవీ ఒకటి. ఇకపోతే ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మొదట ఈ సినిమాను పవన్ తో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనకు కథను కూడా వినిపించాడట. కానీ ఆయన మాత్రం ఈ కథతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చుపలేదట. దానితో మహేష్ తో త్రివిక్రమ్ అతడు సినిమాను రూపొందించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలా పవన్ రిజెక్ట్ చేసిన పోకిరి , అతడు కథలతో మహేష్ అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: