
నాచురల్ స్టార్ నాని తన సహజమైన నటన ... స్మైల్ తో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నాని అంటే చాలా మందికి ఇష్టం.. డైరెక్టర్ గా కొన్ని సినిమాలుకు పనిచేసిన నానికి అదృష్టం తలుపు తట్టడంతో అనుకోకుండా హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్లర్ తో స్టార్ గా ఎదిగాడు. అష్టా చెమ్మా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకున్నాడు. తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ . రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఈగ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తర్వాత వరుసగా హిట్ సినిమాలతో స్టార్ స్టేటస్ అనుకున్నాడు.
మొదట్లో లవర్‌బాయ్‌గా కనిపించిన ఈ హీరో దసరా మూవీతో మాస్ హీరోగా మారి, తన నటతో మంచి ఫేమ్ సంపాదించుకుని ఇప్పుడు టాలీవుడ్ లోనే మినిమం ప్రామీసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దసరా సినిమా లో నాని నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. నాని ప్రస్తుతం ఒక్కో సినిమాకు దాదాపు గా రు. 30 - 35 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. నాని ఒక వైపు హీరోగా చేస్తూనే , మరోవైపు నిర్మాతగా మారి ... వరసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
మరీ ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఏకంగా, మెగాస్టార్ చిరంజీవి సినిమా ను నిర్మించే రేంజ్ కు ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఏ మాత్రం చిన్న విసయం కాదు .. నాని ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్‌కు ఎదిగాడో చెప్పేందుకు నిదర్శనం. అయితే నాని అసలు పేరు గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. నాని అసలు పేరు నవీన్ బాబు అంట. ఈయన ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత తన పేరు నానిగా మార్చుకున్నట్లు సమాచారం.