* ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


కోలీవుడ్ సీనియ‌ర్ హీరో ... తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ కూలీ ’ . ప్రస్తుతం కూలీ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఇక కూలీ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక కూలీ సినిమా లో ఓ స్పెష‌ల్ ఐటెం సాంగ్ ఉంద‌ట‌. ఆ సాంగ్ సినిమా కే మేజ‌ర్ హైలెట్ గా నిలుస్తుంద‌ని కూడా కోలీవుడ్ సినీ స‌ర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.


ఈ స్పెష‌ల్ సాంగ్ లో ర‌జ‌నీ కాంత్ తో క‌లిసి అందాల భామ పూజా హెగ్డే స్టెప్పులు వేయనుంది. సిజ్లింగ్ సాంగ్‌గా రానున్న ఈ డ్యాన్స్ నెంబర్‌లో పూజా తన గ్లామర్‌తో ప్రేక్షకులు ను ఓ రేంజ్ లో ఆకట్టుకోనుంద‌ని టాక్ ? ఇక ఈ ఒక్క సాంగ్ కోసం పూజా హెగ్డే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు ప్ర‌చారం చేస్తున్నాయి. ఒక్క స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్  డిమాండ్ చేసి మ‌రీ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


గ్లామర్ షో‌తో పాటు సాలిడ్ స్టెప్పులు వేయడంలో పూజా పర్ఫెక్ట్ ... ఈ విష‌యంలో ఎన్నో సినిమా ల‌లో చూసేశాం. ఆమె కు సౌత్ తో పాటు నార్త్ లోనూ క్రేజ్ ఉంది. కాబట్టి, ఆమె కోరినంత పేమెంట్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. తెలుగు, తమిళ్‌లో పెద్దగా అవకాశాలు లేని పూజా కేవలం ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేయడం గొప్ప విష‌య‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: