ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మార్చేస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు . ఒకప్పుడు అందాల ముద్దుగుమ్మలు అందరూ కూడా పెళ్లిని ఆలస్యం చేసుకునే వాళ్ళు.  దానికి రకరకాల కారణాలే ఉన్నాయి . త్వరగా పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావు అన్న భయమో.. లేకపోతే పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ అంటూ బాడీని కంట్రోల్ లో పెట్టుకోలేము అన్న భయంతోనో..రీజన్ తెలియదు కానీ చాలామంది స్టార్ సెలబ్రిటీస్ మరీ ముఖ్యంగా హీరోయిన్స్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు.

కానీ ఈ మధ్యకాలంలో మాత్రం హీరోయిన్స్ చాలా త్వరగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . అంతే త్వరగా బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు కూడా అందజేస్తున్నారు . అయితే పెళ్లి చేసుకొని బిడ్డలను కన్న తర్వాత కూడా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా పలువురు బ్యూటీస్ రాణిస్తూ ఉండటమే అందుకు కారణం అంటూ తెలుస్తుంది. కాగా రీసెంట్ గానే ఇండస్ట్రిలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ తన ఫ్రెండ్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది .

గోవాలో వీళ్ల పెళ్లి చాలా ట్రెడిషనల్ గా అంగరంగ వైభవంగా జరిగింది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ వీళ్ల పెళ్ళికి అటెండ్ అయ్యి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . అయితే ఇదే మూమెంట్లో మరో హీరోయిన్ పెళ్లి వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన శ్రద్ధాదాస్ . యస్  శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . చేసింది చాలా ఎక్కువ సినిమాలో హిట్ కొట్టిన మాత్రం చాలా తక్కువ కానీ సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది .

కాగా ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో లు షేర్ చేస్తూ కుర్రాలను కనివిందు చేస్తూనే ఉంటుంది . సోషల్ మీడియాలో ఈమె పెళ్ళికి సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది . ఆమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది.  అంతేకాదు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇంట్లో కూడా చెప్పి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు అంటూ తెలుస్తుంది . త్వరలోనే ఇదే విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టబోతుందట శ్రద్ధాదాస్ . దీంతో కీర్తి సురేష్ తర్వాత అలాంటి వార్తలతో బాగా వైరల్ అవుతుంది హీరోయిన్ శ్రద్ధాదాస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: