బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ మూవీలోని దబిడి దిబిడే అనే ఐటెం సాంగ్ తో ఓవైపు నెగిటివిటీ తో పాటు మరోవైపు భారీ పాపులారిటీని కూడా సంపాదించింది ఊర్వశి రౌటేలా.ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోని స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ దక్షిణాదిలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించింది.ముఖ్యంగా దక్షిణాది ఇండస్ట్రీ ద్వారానే తనకి మంచి పాపులారిటీ లభిస్తుంది అని ఊర్వశి  రౌటేలా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోని గే అని పెళ్లి చేసుకోబోతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఆ ప్రచారానికి కారణం ఏంటి.. ఇంతకీ ఊర్వశి రౌటేలా పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్లో ఓర్రి అనే వ్యక్తి ఎంత ఫేమసో చెప్పనక్కర్లేదు. 

చాలామంది సౌత్ నార్త్ హీరోయిన్లు ఈయనంటే పడి చచ్చిపోతారు. ఎంతో మంది హీరోయిన్లు ఈయనతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్ గా ఉన్న ఒర్రీని చాలామంది గే అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈయన బిహేవియర్ అలా ఉంటుందని బీ టౌన్ లో టాక్. అయితే అలాంటి గే ని ఊర్వశి రౌటేల పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం తాజాగా ఊర్వశి  రౌటేల తన సోషల్ మీడియా ఖాతాలో ఒర్రీని ఉద్దేశించి నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నా అని పోస్ట్ పెట్టింది. 

అయితే ఈ పోస్టుకు రిప్లై గా ఓర్రి నీ పెళ్లి కాదు మన పెళ్లి అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో చాలా మంది నెటిజన్లు ఏంటి ఊర్వశి రౌటేలా ఓ గే ని పెళ్లి చేసుకోబోతుందా..ఇది నిజమేనా మన పెళ్లి అని ఒర్రి అన్నారంటే నిజంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టే అని కామెంట్ పెడుతున్నారు.కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే..ఊర్వశి రౌటేలకు కూడా పెళ్లి కాలేదు.కాబట్టి ఓర్రి ఆ ఉద్దేశంతో నీకు కూడా పెళ్లి కాలేదు. ననీ పెళ్లి కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా అని రిప్లై ఇచ్చాడు.కానీ ఇది అర్థంకాని కొంతమంది నెటిజన్స్  మన పెళ్లి అన్నాడు అంటే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: