
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోయిన్ త్రిషనే. కాగా ఇప్పుడు త్రిష ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంది . సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ త్రిష అని చెప్పుకోవాలి. అయితే త్రిష తర్వాత స్థానాన్ని ఇండస్ట్రీలో రీప్లేస్ చేసే హీరోయిన్ ఎవరు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చాలామంది ఆ ప్లేస్ శ్రీలీలది అంటుంటే మరికొందరు మాత్రం కృతిశెట్టిది అంటున్నారు. త్రిష అటు హాట్ రోల్స్ కి ఇటు ట్రెడిషనల్ రోల్స్ కి రెంటికి సెట్ అవుతుంది.
అయితే శ్రీ లీల కేవలం ట్రెడిషనల్ రోల్స్ కి మాత్రమే సెట్ అవుతుంది అంటున్నారు జనాలు. కృతిశెట్టి ఎలాంటి రోల్స్ లోనైనా అవలీలగా నటించేస్తుంది. ఆమె ఫిజిక్.. త్రిష ఫిజిక్ ఒకేలా ఉంటుంది . మరీ ముఖ్యంగా సైడ్ నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు అంటుంటారు జనాలు. బహుశా అక్క చెల్లెలు అనుకున్న తప్పులేదేమో అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . అన్నీ కలిసి వస్తే త్రిష ప్లేస్ ఇండస్ట్రీలో రీప్లేస్ చేసేది కృతిశెట్టి నే అంటూ ట్రెండ్ చేస్తున్నారు . కానీ తెలుగులో అవకాశాలు రావడం లేదు వచ్చిన అవకాశాలు అరా కొరా కూడా ప్లాపులుగా మిగిలిపోయాయి. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో..??