తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరు చాలా సంవత్సరాల క్రితం సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఇప్పటికి కూడా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే వీరు నలుగురు కలిసి ఏదైనా సినిమాలో కలిసి నటిస్తే చూసి ఆనందించాలి అని వారి అభిమానులు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం ఓ సినిమాలో వీరు కలిసిన నటించారు. ఇక వీరు కలిసి ఒక సినిమాలో హీరోలుగా నటించకపోయిన ఈ నలుగురు హీరోలలో ఓ హీరో నటించిన సినిమాలో మిగతా ముగ్గురు హీరోలతో పాటు మరి మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా కనిపించారు. ఆ సినిమా ఏది ..? ఆ సినిమాలో హీరోగా నటించిన వారు ఎవరు ..? అందులో స్పెషల్ గెస్ట్ లుగా కనిపించిన నటులు ఎవరు అనేది తెలుసుకుందాం.

విక్టరీ వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితం త్రిమూర్తులు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలోని ఒక సాంగ్ లో వెంకటేష్ తో పాటు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున కూడా కనిపించారు. వీరితో పాటు శోభన్ బాబు , కృష్ణం రాజు , విజయ శాంతి , భాను ప్రియ కూడా కనిపించారు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తూ ఉండగా ... బాలకృష్ణ "అఖండ 2" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. నాగార్జున ప్రస్తుతం కూలీ , కుబేర సినిమాల్లో కీలక పాత్రలలో నటిస్తూ ఉండగా ... వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: