ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా బన్నీ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఇక ఈ సినిమా లోని బన్నీ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరిదో సినిమా చేస్తాడు అనే దానిపై ఫుల్ కన్ఫ్యూజన్ ఏర్పడింది.

కొంత కాలం క్రితం పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు అని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం బన్నీ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి అట్లీతో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బన్నీ తన తదుపరి మూవీ ని ఎవరితో చేస్తాడు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa