కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా తమిళ సినిమాలలో నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో నటుడడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే సూర్య తను నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. తెలుగు లో ఈయన నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. దానితో ఈ నటుడికి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే ఆఖరుగా సూర్య "కంగువా" అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న రైట్రో అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని కూడా తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ హక్కులను ఓ క్రేజీ నిర్మాత దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ "రెట్రో" మూవీ తెలుగు వర్షన్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: