తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నదులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈయన చాలా మూవీ లతో మంచి విచారణ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ఆఖరుగా నాని , వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అనుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లోనూ , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ మూవీ లోనూ హీరో గా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీల షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే గతంలో నాని , శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా అనే మూవీ వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అనిరుద్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు అనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన టీజర్ను మరికొన్ని రోజుల్లోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క టీజర్ ను ఏకంగా 8 భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ టీజర్ ను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ తో పాటు మరికొన్ని భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ను ఎనిమిది భాషల్లో విడుదల చేస్తూ ఉండడంతో సినిమాను కూడా కచ్చితంగా ఎనిమిది భాషల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: