
అలాంటి సిచువేషన్ త్వరలోనే ఇండస్ట్రీ రాబోతుంది అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే దుబాయ్లో జరిగిన ఓ పెళ్లిలో టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీస్ అంత కలుసుకుని తలుక్కున మెరిశారు. మరొకసారి అలాగే స్టార్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఓ ఫంక్షన్ కి అటెండ్ కాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది మరెవరో కాదు అక్కినేని అఖిల్ పెళ్లి వేడుక. యస్..ఇదే న్యూస్ ఇప్పుడు ఇందస్ట్రీలో బాగా వైరల్ గా మారిపోయింది.
నాగార్జున రెండవ కొడుకు అక్కినేని అఖిల్ మార్చి 24వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్త బాగా సర్కులేట్ అవుతున్నాయి. కాగా ఈ పెళ్లిని కూడా దుబాయ్ లోనే జరిపించబోతున్నారట ఇరుకుటుంబ సభ్యులు. అంతేకాదు ఈ పెళ్లికి టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ హాజరు అయ్యేలా స్పెషల్ కేర్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నారట నాగార్జున . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ - రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి - మహేష్ బాబు లాంటి స్టార్స్ కూడా ఈ వెడ్డింగ్ కి కచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటూ ఫోర్స్ చేస్తున్నారట. అదే నిజమైతే మాత్రం మరొకసారి స్టార్ సెలబ్రెటీస్ అందరినీ ఒక్కే స్టేజిపై చూడొచ్చు అంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్..!