జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు గురించి చెప్పాలి అంటే పెద్ద చరిత్రే ఉంది. అసలు చరిత్ర అన్న పదం ఈ పేరు నుంచే పుట్టిదేమో అంటుంటారు జనాలు. మరీ ముఖ్యంగా ఈ పేరుకే పెద్ద ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. తారక్.. సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరో.  ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే పాన్ ఇండియా రేంజ్ అని చెప్పుకోవడం చాలా చాలా చిన్నది . మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఒక హీరోలా కాకుండా ఒక అన్నల అభిమానిస్తూ ఆరాధిస్తూ ఉంటారు జనాలు . దానికి రీజన్స్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


జూనియర్ ఎన్టీఆర్ అందరిలా ఓవర్ యాక్టింగ్ చేయరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు.  అది తెరపైన అయినా.. తెర వెనకైనా . ఆయన నీతి నిజాయితీ అంటే ఎప్పుడు అందరికీ ఇష్టమే . మరి ముఖ్యంగా కొంతమంది నందమూరి ఫ్యాన్స్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తర్వాత అలాంటి క్వాలిటీస్ ఉన్నా ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. కాగా అలాంటి జూనియర్ ఎన్టీఆర్కి ఒక పాడు అలవాటు ఉండేది అన్న వార్త అప్పట్లో బాగా ట్రెండ్ అయింది సంచలనంగా మారింది .

జూనియర్ ఎన్టీఆర్ కి బాగా కోపం వచ్చేస్తుందట . ఎంతలా అంటే నోటి నుండి ఎలాంటి బూతు మాటలు వస్తాయో ఎక్స్పెక్ట్ కూడా చేయలేమట . యంగ్ ఏజ్ లో జూనియర్ ఎన్టీఆర్ బాగా కోప్పడిపోయేవారట . సెకండ్స్ లోనే కోపం వచ్చేసి నోటి నుండి పచ్చి బూతు పదాలు వచ్చేవట . అయితే లక్ష్మీప్రణతిని పెళ్లి చేసుకున్న తర్వాత కోపాన్ని మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసారట . ఒక విధంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ చేత బూతులు మానిపించిన ఘనత లక్ష్మీ ప్రణతికే దక్కుతుంది అంటున్నారు జనాలు.  మరియు ముఖ్యంగా లక్ష్మీ ప్రణతి అంటే చాలా చాలా ప్రాణం జూనియర్ ఎన్టీఆర్ కి.. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో బయటపెట్టాడు తారక్. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . త్వరలోనే ఆయన నటించిన వార్ 2 సినిమా రిలీజ్ కావాలి . అంతేకాదు దేవర 2 ని కూడా సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్..!!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: