
తాజాగా సమంత 110 కేజీల బరువు కలిగిన వాటిని లిఫ్టింగ్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. జిమ్ వర్క్ అవుట్ ఎక్కువగా కండలు రావడానికి వెయిట్ లిఫ్ట్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బాడీ మొత్తం ఫిట్గా ఉండాలి అంటే పలు రకాల వర్కౌంట్లో చేయవలసి ఉంటుంది. అయితే సమంత తన హిప్స్ తో బరువుని ఎత్తడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా 110 కేజీలు బరువు ఉన్నటువంటి వెయిట్ లిఫ్టును ఎత్తడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సమంత హీరోయిన్గా తెలుగులో ఈ మధ్యకాలంలో సినిమాలలో కనిపించడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ వైపుగాని అడుగులు వేస్తోంది. అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది సమంత. నాగచైతన్య తో విడాకుల అనంతరం పూర్తిగా బాలీవుడ్ వైపు గానే మారిపోయింది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా సమంత వాటిని కూడా అధికమించడానికి తన వంతు కృషి చేస్తూనే ఉంటుంది. బాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలకు సైతం జోడిగా నటిస్తూ బిజీగా ఉన్న సమంత త్వరలోనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నదట. మొత్తానికి సమంత జిమ్ వర్క్ అవుట్ లు చేస్తున్న ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.