
ఈ విషయం విన్న అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే వివాహమైన రెండు సంవత్సరాల తర్వాత ఈ జంట మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలియజేసింది. ఇక కియారా త్వరలోనే రణవీర్ సింగ్ తో కలిసి డాన్ 3 చిత్రంలో నటించాల్సి ఉంది. మరి ఈ సినిమా వదిలేసుకుంటుందా లేకపోతే ఏంటా అన్నది తెలియాల్సి ఉన్నది. కియారా భర్త సిద్ధార్థ కూడా ప్రస్తుతం పరమ్ సుందరి అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారట.
కియారా, సిద్ధార్థ ఇద్దరూ కూడా షేర్షా అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కాఫీ విత్ కరెంట్ షోలో తెలియజేశారు. ఫగ్లి అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ తర్వాత ఎమ్మెస్ ధోని అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత రామ్ చరణ్ తో రెండు సినిమాలలో నటించింది కానీ ఈ సినిమాలేవి సక్సెస్ కాలేదు. మొత్తానికి కియారా, సిద్ధార్థ గుడ్ న్యూస్ చెప్పేశారు..