టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు. ఇకపోతే వీరిద్దరూ తమ కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడారు. కానీ వీరిద్దరు ఒక హీరోయిన్ తో నటించిన సినిమాలు అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో కూడా సినిమాల్లో నటించింది. ఇకపోతే ప్రభాస్ హీరో గా రూపొందిన డార్లింగ్ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ప్రభాస్ , కాజల్ కాంబో లో రెండు సినిమాలు రాగా ఆ రెండు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో బాద్ షా అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో టెంపర్ అనే మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ "జనతా గ్యారేజ్" అనే సినిమాలో హీరో గా నటించగా. .. ఇందులో కాజల్ స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా తారక్ నటించిన నాలుగు సినిమాల్లో కాజల్ నటించిన ఆ నాలుగు మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: