తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన వారిలో అనేక మంది ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్న ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాల్లో కాకుండా తమ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ వస్తున్నారు. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో అనేక మంది ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న వారిలో చాలా మంది మంచి విజయాలను అందుకొని లేడీ ఓరియంటెడ్ పాత్రలతో కూడా తమను తాము నిరూపించుకున్న వారు అనేక మంది ఉన్నారు.

కానీ ఓ ముద్దు గుమ్మ మాత్రం లేడీ ఓరియంటెడ్ సినిమాతో అద్భుతమైన విజయం అందుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె ఎవరో కాదు ... తెలుగు సినీ పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించి ప్రస్తుతం కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్.

కాజల్ అగర్వాల్ తన కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్న ఆమెకు మాత్రం ఆ జోనర్ సినిమాల ద్వారా మంచి విజయాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితమే ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. సత్యభామ సినిమా ప్రేక్షకులను నిరాశ పరచిన ఈ సినిమాలో కాజల్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ లోని కాజల్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: