
ఇస్మార్ట్ శంకర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ అంటూ గుబురు గడ్డం తీయలేదు. కానీ ఇప్పుడు డైరెక్టర్ మహేష్ తో చేయబోయే సినిమా కోసం లవర్ బాయ్ గా మారిపోయాడు .. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్లీ రామ్ పక్క క్లాస్ సినిమా చేస్తున్నాడు. మరో యంగ్ హీరో అఖిల్ కూడా తన తర్వాత సినిమాల కోసం బీస్ట్ గా మారిపోతున్నాడు .. భారీగా కండల పెంచేసి హల్క్ లా మారిపోయాడు.. యువి క్రియేషన్స్ లో భారీ సినిమాతో పాటు .. వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరితో ఓ సినిమా చేయనున్నాడు .. ఈ రెండు కూడా ఊహించని డిఫరెంట్ కథలగానే ఉండబోతున్నాయి.
అలాగే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాలు ఏటిగట్టు కోసం ఊహించని మేకవర్లో అదరగొడుతున్నాడు .. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా సినిమా సినిమాకు మారిపోతున్నాడు .. లైగర్ కోసం బీస్ట్ మూడ్లోకి మారిన ఈ హీరో ఖుషి , ఫ్యామిలీ స్టార్స్ మూవీస్ లో రొమాంటిక్గా కనిపించాడు. ఇప్పుడు కింగ్డమ్ సినిమా కోసం ఏకంగా గుండు రఫ్ వైల్డ్ గా మారిపోయాడు.. ఆ తర్వాత రాహుల్ సంక్రీత్యన్ సినిమా కోసం మరోలా కనిపించబోతున్నాడు .. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా స్వయంభు , ఇండియా హౌస్ కోసం డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఇలా మన యంగ్ హీరోలో సినిమా సినిమాకు ఊహించని విధంగా తమను మార్చేసుకుంటున్నారు.