వేసవికాలం వస్తే చాలు ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటారు .. లొకేషన్స్ కి వెళ్ళటం,  ఫ్యామిలీతో  కలిసే సినిమాలు చూడటం ఇలా ఎంతో సరదాగా గడపడానికి అందరూ ఇష్టపడతారు .. అయితే ముఖ్యంగా సమ్మర్లో ఏ సినిమాలు వస్తున్నాయో .. చూసి ఆ సినిమాలు చూడడానికి ప్లాన్ చేసుకుంటారు చాలామంది .. అయితే ఇప్పుడు ఈసారి సమ్మర్ హౌస్ ఫుల్ కాబోతుందా లేదా అనేది ఇక్కడ చూద్దాం. నిన్న మొన్నటి వరకు ఉన్న సిట్యుయేషన్ చూస్తే 2025 స‌మ్మ‌ర్‌ కూడా పూర్తిగా ఖాళీగా ఉంటుందని అనుకున్నారు .. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఈ సమ్మర్ కూడా హౌస్ ఫుల్ కాబోతుంది .. స్టార్ హీరోలెవరు లేకపోయినా మీడియం రెంజ్‌ హీరోలే దాదాపు 300 కోట్ల బిజినెస్ చేస్తున్నారు .. మరి ఈ మండు వేసవిలో చల్లటి  వినోదాన్ని పంచడానికి వస్తున్న ఆ సినిమాలు ఏమిటంటే..


 ఇక మార్చ్ 28న ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని కచ్చితంగా చెబుతున్నారు మేకర్స్ .. ఒకవేళ ప‌వ‌న్ వ‌స్తే ఈ ఒక్క సినిమాకి 200 కోట్ల బిజినెస్ జరగటం ఫిక్స్ .. అలాగే మరో పక్క అదే రోజు నితిన్ రాబిన్ హుడ్.. ఆ తర్వాత రోజు మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రాబోతున్నాయి . ఈ రెండు సినిమాలు బిజినెస్ కూడా దాదాపు 50 కోట్లు పైనే ఉంది. ఇలా మార్చు చివరివారం నుంచే సమర్ సినిమాల సందడి మొదలుకానుంది .. రాబిన్ హుడ్ , హరిహర వీరమల్లు , మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లోనే రాబోతున్నాయి .. పవన్ వస్తే వీటిలో కనీసం ఒక్క సినిమా అయినా వాయిదా పడటం కాయం. తర్వాత ఏప్రిల్ 10న జాక్ తో సిద్దు జొన్నలుగడ్డ వస్తున్నాడు ..


 ఇక గత సమ్మర్లో టిల్లు స్క్వేర్ తో భారీ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 18న అనుష్క దర్శకుడు క్రిష్ కాంబోలో వస్తున్న ఘాటి రిలీజ్ కానుంది .. దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత అనుష్క ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ఇదే .. ఇక తర్వాత ఏప్రిల్ 25న మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కానుంది .. ఈ సినిమాపై మంచి అంచనాలు లేకపోయినా . ప్రభాస్ , మోహన్లాల్ , అక్షయ్ కుమార్ నటిస్తున్నారు కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి సౌండ్ చేయటం ఫిక్స్. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సమ్మర్ లో వస్తే మంచిదే.. అయితే ఆయన రాకపోతే మాత్రం ఫస్ట్ పెద్ద సినిమా హిట్ 3.. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది .. ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పనిచేస్తుంది .. ఈ సినిమాతో మరోసారి భారీ హిట్ పై కన్నేసాడు నాచురల్ స్టార్. ఈ సమ్మర్ కూడా భారీ సినిమాలతో హౌస్ ఫుల్ అవటం ఫిక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: