ఈ 2025 కొత్త సంవత్సరం లో జనవరి , ఫిబ్రవరి ఈ రెండు నెలల్లో సుమారు టాలీవుడ్లో 25 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. అయితే ఆ 25 సినిమాల పేర్లు ఏంటి అంటే కూడా గూగుల్లో వెతికితే తప్ప ఎవరికీ తెలియదు .. ఈ రెండు నెలలు మాత్రం నిర్మాతలకు బయ్యర్లకు అయితేనే మంచి లాభాలు తెచ్చిపెట్టాయి అనిపించుకున్న సినిమాలు మాత్రం రెండే రెండు .. అందులో ఒకటి జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం .. ఇక ఫిబ్రవరిలో వచ్చిన తండేల్‌..


 ఇలా వచ్చిన ఈ 25 సినిమాల్లో 10 నుంచి 15 సినిమాలు కేవలం హీరోలు , దర్శకుల సంతృప్తి కోసం తెర్కక్కించారు .. మొత్తం ఏదో ఒక ఒకటి రెండు థియేటర్లో విడుదల చేశారు .. మిగిలిన 10 సినిమాలు కాస్త పబ్లిసిటీ చేసుకొని వచ్చాయి .. దీంట్లో ఓ రేంజ్ నుంచి ఓ మాద్రి స్థాయి వరకు పబ్లిసిటీ జరిగింది .. రిలీజ్ కూడా అదే విధంగా ఉంటుంది .. కానీ ఫలితం మాత్రం అందన్ని దాక్షాల ఉంది. మంచి సినిమాలు అనిపించినవి కూడా బాక్సాఫీస్ దగ్గర దుకాణం సద్దేసుకుంటున్నాయి . కోటి నుంచి 25 కోట్లు తీసుకునే హీరోల చిన్న హీరెలుకు కూడా పట్టుమని పది టికెట్లు కూడా తెగటం లేదు ..


100% కంటెంట్ ఉంటే తప్ప టిక్కెట్లు ప్రజెంట్ తేగడం లేదు అదే పెద్ద హీరోలైతే .. సగం కంటెంట్ ఉన్న లాగేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాతలు ఇంకా హీరోలను నమ్మి .. హీరోలకు కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చి సినిమాలు చేసి భారీగా పబ్లిసిటీ చేసి ప్రేక్షకులు రావటం లేదని బాధపడుతున్నారు .. ఇక్క‌డ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సినిమాలో కంటెంట్ బాగానే ఉందని రివ్యూలు వచ్చినా కూడా .. ప్రేక్షకులు రావడం లేదంటే .. ఆ హీరోలకు క్రౌడ్ పుల్లింగ్ లేదని అనుకోవాలి తప్ప మరో కారణం కనిపించదు .

మరింత సమాచారం తెలుసుకోండి: