ఎవరైనా తమపై తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడైనా వెంటనే స్పందిస్తారు .. కొందరు అలా చేసిన వారికి లీగల్ గా నోటీసులు కూడా పంపుతారు .. అయితే దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. రీసెంట్ గా శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళి పై తీవ్ర ఆరోపణలు చేశాడు .. 34 ఏళ్లుగా తాము స్నేహితులుగా ఉన్నామని చెప్పిన ఆయన . ఈమధ్య తనను రాజమౌళి టార్చర్ పెడుతున్నాడని, నరకం చూపిస్తున్నాడని ఆరోపిస్తూ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సంచల ప్రకటన చేశాడు. ఇక ఆ వీడియో రిలీజ్ అయి దాదాపు 24 గంటలు పూర్తవుతుంది ..


అయితే రాజమౌళి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు .. అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు .. అయితే ఇష్యూ చూస్తుంటే శ్రీనివాసరావు ఆరోపణలు రాజమౌళితో పాటు ఆయన ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక నిజానికి కొన్ని వివాదాలు పై స్పందించకుండా మౌనంగా ఉండటమే మంచి మార్గం .. మరి ముఖ్యంగా మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉండే అంశాల్లో ఈ విధానం ఎంతో కలిసి వస్తుంది .. ఇప్పుడు బహుశా ఈ మార్గాన్నే రాజమౌళి ఎంచుకున్నట్టు కనిపిస్తుంది . ఇక మరి కొంతమంది మాత్రం ఈ విషయం ఇంకా రాజమౌళి వరకు వెళ్లలేదని కూడా అంటున్నారు ..


ఇందులో ఎలాంటి నిజం లేదు .. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఎంతో వైర‌ల్ అయ‌న‌ ఈ ఇష్యూ వాళ్లకు వెళ్లకుండా ఉండదు .. కచ్చితంగా ఈ వీడియోను రాజమౌళితో పాటు ఆయన ఫ్యామిలీ అంతా చూసే ఉంటారు .. అయితే ప్రెసెంట్ మౌనంగా ఉండటమే మంచిదని అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు .. అయితే నిజానికి రాజమౌళికి నిన్న ఒక్కరోజే గట్టి రెండు దెబ్బలు తగిలాయి .. ఓవైపు ఈ వీడియో రిలీజై ఆయన్ను ఊహించని వివాదంలోకి లాగా .. మరోవైపు మహేష్ బాబు లుక్ లీక్ అయింది ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: