తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో నాగ చైతన్య ఒకరు. తాజాగా ఈయన తండెల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదిన విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైన కళాశాలలో రాబట్టి బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కూడా కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా తాజాగా నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసింది.

అసలు విషయం లోకి వెళితే ... నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సైనా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 52.65 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేయగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 32.30 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక తండెల్ మూవీ మూడు వారాల లోపే సరిపోదా శనివారం సినిమా యొక్క లైఫ్ టైమ్ కలెక్షన్ లను దాటివేసింది. తండెల్ మూవీ మూడు వారాలలోపే ప్రపంచ వ్యాప్తంగా 52.9 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్లను వసూలు చేసింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 43.9 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా సరిపోదా శనివారం సినిమాను ఇప్పటికే తండెల్ మూవీ దాటేసింది. ఇకపోతే ఇప్పటికీ కూడా తండెల్ మూవీ కి మంచి కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్న దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ లోని నాగ చైతన్య , సాయి పల్లవి నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc