
మార్చి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ట్రైలర్ విషయానికి వస్తే నకిలీ బంగారు ఆభరణాల కేసు సైతం దర్యాప్తు చేయడంలో భాగంగా హరిశంకర్ అనే పోలీస్ అధికారి ఎదుర్కొన్న ఇబ్బందులు సవాళ్లు ఏంటివి.. హరి శంకర్ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి అన్న అంశంతో సినిమా తెరకెక్కించినట్లుగా ట్రైలర్లో చూపించారు. ఈ ట్రైలర్ కూడా అద్వంతం బాగా ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 20వ తేదీన మలయాళం ఇండస్ట్రీలో విడుదల చేయగా సుమారుగా 30 కోట్లకు పైగా లాభాలను రాబట్టిందట.
డైరెక్టర్ జీతు అశ్వరావు తెరకెక్కించగా హీరోగా కుంచకొ బోబన్ నటించిన ప్రియమణి హీరోయిన్గా నటించినది. అలాగే జగదీష్ ,విశాంక్ నాయక్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. మరి మలయాళ ఇండస్ట్రీలో భారీ లాభాలను రాబట్టిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా తెలుగు లో ఏ విధంగా కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి మరి. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో ప్రతి సన్నివేశం కూడా సస్పెన్షన్ గాని థ్రిల్లర్ గాని కనిపిస్తూ ఉన్నది. చివరిలో అదిరిపోయే ట్విస్ట్ చూపించారు.