నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించాడు. అందులో అనేక మూవీలలో మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాని ఎప్పుడు దాదాపు రెండు సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ ఉంటాడు. చాలా మంది హీరోలు ఒక సమయంలో ఒకే సినిమా చేస్తూ మరొక సినిమాలు లైన్ లో పెట్టిన ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాతే మరో సినిమాను మొదలు పెడుతూ ఉంటారు.

కానీ నాని అలా అస్సలు చేయకుండా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా పూర్తి చేస్తూ ఉంటాడు. దానితో అనేక సార్లు నాని నటించిన సినిమాలు సంవత్సరానికి రెండు విడుదల అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రమే ఈయన నటించిన సినిమాలు సంవత్సరానికి ఒకటి విడుదల అవుతూ ఉంటాయి. మరి ఇంత స్పీడుగా నాని సినిమాలు చేయడానికి కారణం ఏంటి అని కొంత మంది అనుకుంటూ ఉంటే దానికి ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా సమాధానం ఇచ్చాడు. నాని ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను ఎప్పుడూ స్టార్ దర్శకుల కోసం ఎదురు చూడను. నా దగ్గరికి ఎవరైనా మంచి కథతో వస్తే అతను కొత్త వాడ పాత వాడ అని అస్సలు ఆలోచించను.

అతనిలో టాలెంట్ ఉంది. అతను సినిమాను బాగా తీయగలడు అనిపిస్తే చాలు అతనితో సినిమా చేయడానికి నేను రెడీ అవుతాను. అందుకే నేను ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉంటాను. అలాగే సంవత్సరానికి ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తాను అని నాని చెప్పుకచ్చాడు. ఇకపోతే నాని రస్తుతం హిట్ ది థర్డ్ కేస్ , ది పారడైజ్ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: