ఉప్పెన చిత్రంతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే కుర్రకారులను బాగా ఆకట్టుకోవడంతో ఈమె క్రేజ్ బాగా పెరిగింది. ఆ తర్వాత ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించుకొని పలు చిత్రాలలో నటించే అవకాశం అందుకుంది. అలా వరుసగా నాని, నాగచైతన్య వంటి హీరోలతో కూడా నటించింది. చిన్న వయసులోనే స్టార్ డం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే కృత్తి శెట్టి కెరియర్ కూడా అంతే ఫాస్ట్ గా పడిపోయింది.


ది వారియర్, కస్టడీ, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలలో నటించడంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇవన్నీ కూడా ప్లాపులు గానే మిగిలిపోయాయి. కానీ మలయాళ ఇండస్ట్రీలో నటించిన ARM సినిమా ఫ్లాపుల నుంచి గట్టెక్కిస్తుందని అనుకున్నప్పటికీ ఈమెకు కొంతమేరకు పేరు తెచ్చింది. మలయాళ ఇండస్ట్రీలో తన మొదటి సినిమాతోనే మెప్పించిన కృతి శెట్టి.. టాలీవుడ్ కి దూరంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.


కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం మూడు తమిళ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు ఇమే కెరీర్ ని మారుస్తాయని అందుకే ఈమె ఎక్కువగా తమిళ ఇండస్ట్రీ వైపు గానీ దృష్టి పెట్టిందని తెలుగు సినిమాలో ఈమె కెరియర్ క్లోజ్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు తెలుగు చిత్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లను కూడా తెలియజేయలేదు. ఒకవైపు సోషల్ మీడియాలోనే అభిమానులను అలరిస్తున్న కృతి శెట్టి వాలకం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో శృతిహాసన్, పూజా హెగ్డే బాటలోనే ఈమె పడేటట్టుగా కనిపిస్తోందట. మరి ఏ మేరకు తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి అక్కడే నిలదొక్కు ఉంటుందో చూడాలి మరి. మరి అభిమానుల కోరిక మేరకు ఏదైనా తెలుగు చిత్రాలలో నటిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: