
స్టోరీ :
ఆదిత్య వర్మ ( ఆదిత్య ఓం ) పేరుమోసిన లాయర్. భారీ కేసులను వాదించడంలో మంచి పేరు ఉంటుంది. ఓ అడవికి సంబంధించిన కేసును వాదిస్తూ ఉంటాడు. దీనిని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే ఆదిత్య వర్మకు సంబంధించిన రెండు విషయాలను ఇందులో పార్లర్ గా చూపించారు. ఒకటి ఓ రిసార్ట్‌లో ఆయన లగ్జరీలను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన భార్య పిల్లలను వదిలేసి ఆఫీసుకు సెలవు పెట్టి ప్రియురాలతో రిసార్ట్‌లో ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. ఆయన ప్రియురాలు రావడం ఆలస్యం అవుతుంది. ఈలోపు ఆమె ఆదిత్య వర్మకి కొన్ని టాస్కులు ఇస్తుంది. రెండోది అడవిలో ఆదిత్య వర్మని కొందరు గుర్తి తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోతారు. అందులో తనని తాను రక్షించుకునేందుకు అడవి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు.. తినటానికి తిందులేదు.. సరైన నీళ్లు లేవు.. ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. నీళ్ల కోసం అరుస్తూ ఉంటాడు.. కానీ ఆయన పట్టించుకునే మనుషులు ఎవరూ ఉండరు. మరోవైపు రిసార్ట్లో ఆదిత్య వర్మ లగ్జరీ అనుభవిస్తూ.. తన ప్రియురాలు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.. కానీ ఆమె అదిగో ఇదిగో అని ఆలస్యం చేస్తూనే ఉంటుంది.. టాస్కుల మీద టాస్కులు ఇస్తూనే ఉంటుంది.. ఆమె ఎలాంటి టాస్కులు ఇచ్చింది ? ఆ టాస్కులు ఇవ్వటానికి కారణం ఏంటి ? రిసార్ట్ లో ఎంజాయ్ చేసే ఆదిత్య వర్మని అడివిలోకి ఎందుకు వదిలేశారు ? అడవిలో ఆదిత్య వర్మ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు ? దాని నుంచి ఎలా బయటపడ్డాడు ? అడవిలో సర్వైవల్ కోసం స్ట్రగుల్ అయ్యే క్రమంలో ఆదిత్య వర్మ ఏం ?తెలుసుకున్నాడు .. ప్రకృతి గురించి ఆయన తెలుసుకున్న నిజం ఏంటి ? చివరికి ఈ కథ ఎలా ముగిసింది అన్నదే మిగిలింది సినిమా.
విశ్లేషణ :
ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ హాలీవుడ్‌లో చాలా వచ్చాయి. అయితే తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ మూవీని నాలుగు సంవత్సరాలు కష్టపడి చిత్రీకరించారు. కథ మొత్తం ఆదిత్య ఓం చుట్టూ తిరగడంతో పాటు మెయిన్ క్యారెక్టర్ కూడా అతడిదే.. ఇది సింగిల్ క్యారెక్టర్ మూవీ. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు అన్నీ అతడే చేశాడు. ఎండ, గాలి, నీరు, భూమి, వర్షం.. ఇలా ప్రకృతి, మనిషి మీద పగబడితే, ఎలాంటి విపత్తులు వస్తాయి ? అడవులు నరికితే, వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే ఆలోచనను సినిమాగా తెరకెక్కించాలనే ఉద్దేశంతో కథను చక్కగా రాసుకున్నాడు డైరెక్టర్ రఘు తిరుమల.
తాను చెప్పాలనుకున్న విషయాన్ని తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మధుసుదన్ కోట సినిమాటోగ్రఫీ, చాలా ప్లస్ అయ్యింది. వీరల్ - లవన్, సుదేశ్ సావంత్ ఇచ్చిన మ్యూజిక్, సినిమాకి చక్కగా ఉపయోగపడింది. ఆదిత్య ఓం మంచి నటుడు. సోలో క్యారెక్టర్ మూవీ కావడంతో సినిమా అంతా అతనే కనిపిస్తాడు. అయితే ఎక్కడా బోర్ కొట్టించకుండా తన నటనతో మెప్పించాడు ఆదిత్య ఓం.. కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా కనిపించాడు కూడా.. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతుంది. దీనికి కాస్త థ్రిల్లర్ యాడ్ చేయడంతో ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ వాయిస్ ఆదిత్య వర్మ ఎలాంటి వాడు.. ఇలా ఎందుకు మారాడు ? అనేది చెప్పే తీరు కథలో అందరూ ఇన్వాల్ అయ్యేలా చేస్తుంది. ఇది సాధారణ ఆడియెన్స్‌కు కూడా మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
ఫైనల్‌గా...
ఏ సినిమాకి అయినా ప్రమోషన్ చాలా ముఖ్యం. నాలుగేళ్లు కష్టపడి, సినిమా చేసిన చిత్ర యూనిట్ సరైన ప్రమోషన్స్, పబ్లిసిటీ లేకుండానే థియేటర్లలోకి ‘బందీ’ సినిమాని తీసుకొచ్చింది. ‘బిగ్ బాస్ 8’ తర్వాత మళ్లీ జనాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం, ఈ సినిమాకి సరైన ప్రమోషన్ చేసి ఉంటే.. ‘బందీ’ మూవీకి మంచి రీచ్ వచ్చి ఉండేది. ఓవరాల్‌గా సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఆదిత్య ఓం ‘బందీ’ మూవీ ఓ మంచి అనుభూతిని అందిస్తుంది.
రేటింగ్ : 2.5 / 5