తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన తర్వాత నుండి చాలా కాలం వరకు మంచి విజయాలను అందుకుంటు సినిమా సినిమాకు తన కెరియర్ గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ గత మూడు సినిమాల విషయంలో మాత్రం ఈయన పూర్తిగా ట్రాక్ తప్పినట్లు కనిపిస్తుంది. ఈయన నటించిన ఆఖరి మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోలేదు. ఇక వరుస పెట్టి ఈయన సినిమాల కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి. అలాగే ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా తగ్గుతూ వస్తుంది. ఇకపోతే ఆఖరుగా విశ్వక్ సేన్ నటించిన ఆఖరి మూడు సినిమాలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

విశ్వక్ సేన్ తాజాగా లైలా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా మొదటి రోజు కేవలం 3.5 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కంటే ముందు విశ్వక్ "మెకానిక్ రాఖీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా పరవాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ కేవలం మొదటి రోజు 8.2 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. ఇక ఈ సినిమా కంటే ముందు విశ్వక్ "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అంచనాల నడమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా మొదటి రోజు 20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా విశ్వక్ ఆఖరి మూడు మూవీలకి వరుసగా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs