టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం నిర్మాతలుగా కంటిన్యూ అవుతున్న వారిలో ఎంతో మంది డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక డిస్ట్రిబ్యూషన్ రంగం నుండి నిర్మాతగా మారిన వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి లాభాలను , నష్టాలను ఎదుర్కొని చివరకు డిస్ట్రిబ్యూటర్ గా మంచి స్థాయిలో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఈయన నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా దిల్ రాజు మొదటగా దిల్ అనే సినిమాను రూపొందించాడు.

సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఈయన నిర్మించిన సినిమాలు వరుస పెట్టి మంచి విజయాలను అందుకుంటూ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా ఈయన కంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఇప్పటికే కూడా దిల్ రాజు ఓ వైపు సినిమాలను నిర్మిస్తూనే మరో వైపు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇకపోతే పోయిన సంవత్సరం నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దానితో ఈ మూవీ ద్వారా దిల్ రాజుకు మంచి లాభాలు వచ్చాయి.

ఇకపోతే ప్రస్తుతం నాని "హిట్ ది థర్డ్ కేస్" మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను కూడా దిల్ రాజు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ మంచి విజయం అందుకున్నట్లయితే ఈ సినిమా ద్వారా కూడా దిల్ రాజు కి భారీ ఎత్తునా లాభాలు వస్తాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: