నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య నాలుగో సూపర్ హిట్ కోసం బాక్స్ఆఫిస్ పై దాడి చేసేందుకు సిద్ధం అయ్యాడు.అదీ సంక్రాంతి సీజన్ కావడంతో బాలయ్య సినిమాకి తిరుగే లేదని ఫ్యాన్స్ భావించారు.. డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా ఈ నెల 12 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది..అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్స్ లో స్పీకర్స్ పగిలిపోయాయి.. అంతలా ఈ సినిమాలో ని మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది..

 బాలయ్యకు వరసగా నాలుగో సూపర్ హిట్ అందింది అని డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు సంతోషంగానే ఉన్నారు కానీ చిన్న అసంతృప్తి.కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేసుకున్నారు..అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ గ్రాస్ కలెక్ట్ చేయకుండానే ఈ సినిమా ఫైనల్ రన్ కు వచ్చేసింది..అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్స్ అయితే లేవు...

 వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో కలెక్షన్ పోస్టర్స్ లేకపోవడంతో డాకు మహారాజ్ హిట్ విషయంలో ఫ్యాన్స్ నిరూత్సాహనికి గురయ్యారు.అయితే తాజాగా “మ్యాడ్ స్క్వేర్” మూవీ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ డాకు మహారాజ్ సక్సెస్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు..డాకు మహారాజ్ మేము అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వలేదు. భారీ కలెక్షన్స్ ఎక్సపెక్ట్ చేసాము కానీ సినిమా అంతగా ఆడలేదు.. అయితే ఫ్యాన్స్, ప్రేక్షకులలో ఈ మూవీ పర్వాలేదనే టాక్ ను వినిపించిందని నాగావంశీ క్లారిటీ ఇచ్చాడు. అలాగే మూవీ కలెక్షన్స్ పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు..


మరింత సమాచారం తెలుసుకోండి: