బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తాజాగా ఛావా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందనా హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి అద్భుతమైన ఓపెనింగ్ లు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 14 రోజుల్లో 555.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే 14 రోజులు అవుతున్న ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి ఇప్పటికే అద్భుతమైన హిట్ టాక్ వచ్చి ఉండడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: