
టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది . సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దున్నేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే . ఎందుకంటే ఆమె ట్రెడిషనల్ రోల్స్ తో పాటు హాట్ రోల్స్ లో కూడా మెప్పించింది . మరి ముఖ్యంగా టాలీవుడ్ - బాలీవుడ్ - కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోలతో ఆమె సరి సమానంగా నటించి సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .
కెరియర్ పీక్స్ లో ఉండగానే ఆమె గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకుంది . సేమ్ కాజల్ అగర్వాల్ ఎలా అయితే చేసిందో అదే విధంగా కీర్తి సురేష్ కూడా చేసింది . ట్రెడిషనల్ రోల్స్ లోను ఇటు మోడ్రన్స్ రోల్స్ లోను అవలీలగా సెట్ అయిపోయే కీర్తి సురేష్ కూడా కెరియర్ పిక్స్ లో ఉండగానే తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. మరొకసారి ఇప్పుడు కాజల్ అగర్వాల్ ఇటు కీర్తి సురేష్ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ ఎలా మ్యారీడ్ లైఫ్ సూపర్ సక్సెస్ అయిందో.. కీర్తి సురేష్ కూడా అలాగే సూపర్ సక్సెస్ అవ్వాలి అంటూ కోరుకుంటున్నారు జనాలు..!