ఏదైనా సరే రాజమౌళి డెడికేషన్ కి మాత్రం ఒక హాట్సాఫ్ చెప్పాల్సిందే . అసలు ఈయనకి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అని జనాలు మాట్లాడుకునే స్థాయికి ఆయన ఎదిగిపోతూ ఉంటారు.  రాజమౌళిని హేట్ చేసే వాళ్ళు కూడా ఆయన సినిమాలను లైక్ చేస్తారు అనడంలో ఆశ్చర్యం లేదు . ప్రెసెంట్ రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఎప్పుడు లేని విధంగా రాజమౌళి సినిమా విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్ గా దాచేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా పూజా కార్యక్రమాలను స్టార్ట్ అయిన కూడా మీడియా వాళ్ళని ఒక్క ఫోటోని కూడా బయటికి రానికుండా ఆపేశారు .


దానికి కారణం మహేష్ బాబు లుక్స్ . ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్స్ సెట్ చేయడం కోసమే ఆయన దాదాపు సంవత్సరం టైం తీసుకున్నారు.  అది అందరికీ తెలిసిందే . మహేష్ బాబు ఫిజిక్ ని ఫిజికల్ లుక్స్ ని టోటల్గా మార్చేశారు. అయితే మహేష్ బాబు లుక్స్ ఎలా ఉంటాయో ర్లా ఉంటాయి అంటూ ఇన్నాళ్లు చాలా క్యూరియాసిటిగా వెయిట్ చేశారు జనాలు . వాళ్లందరికీ హైప్ పిచ్చేలా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో లీక్ అయిన ఆ వీడియోలో మహేష్ బాబు లుక్స్ క్లియర్గా తెలిసిపోతున్నాయి .



గుబురు గడ్డంతో తల మొత్తం బాగా జుట్టు పెంచేసి చాలా స్లిమ్ లుక్స్ లో వేటకి సిద్ధమైన సింహంలా ఉన్నాడు మహేష్ బాబు . అయితే మహేష్ బాబు లుక్స్ పట్ల అందరు హ్యాపీనే కానీ అసలు ఈ వీడియోని ఎవరు లీక్ చేశారు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది . మహేష్ బాబు -రాజమౌళి ఇన్నాళ్లు కష్టపడి ఎంతో ఇష్టంగా దాచిన లుక్స్ మొత్తం రివిల్ అవ్వడం పట్ల ఒకపక్క ఫ్యాన్స్డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు . అయితే కొందరు మాత్రం ఈ లుక్స్ లో మహేష్ బాబుని చూసి ఆర్య 2 సినిమాలో  అల్లు అర్జున్ ని గుర్తు చేసుకుంటున్నారు . అల్లు అర్జున్ మిస్టర్ పర్ఫెక్ట్ గా కాకముందు ఇలాగే గుబురు గడ్డంతో తల నిండా జుట్టును పెంచేసుకుని కనిపిస్తాడు.  బహుశా రాజమౌళి ఆ లుక్స్ ను చూసి ఈ లుక్స్ కాపీ కొట్టాడా ..? అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి ఈ సోషల్ మీడియా రాజమౌళికి పెద్ద తలనొప్పి క్రియేట్ చేసేలా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: