ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అని కొన్ని రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాకుండా తన తదుపరి మూవీ ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో చేయబోతున్నాడు అని కూడా వార్తలు వస్తున్నాయి.

కానీ ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడితో చేయబోతున్నాడు అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబో మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పట్లో రాదు అని , ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సంవత్సరం చివరన వచ్చే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇకపోతే ఒక వేళ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ తదుపరి మూవీ గా ఉంటుందా ... లేదా అట్లీ సినిమా తర్వాత ఉంటుందా అనే దానిపై కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఏదేమైనా పుష్ప లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత బన్నీ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఆ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని ఏ దర్శకుడితో చేస్తాడు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: