కొంత కాలం క్రితం సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా విమల్ కృష్ణ దర్శకత్వంలో డిజె టిల్లు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా ద్వారా సిద్దు , నేహా , విమల్ ముగ్గురికి కూడా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీ ని అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ కి డిజె టిల్లు మూవీ దర్శకుడు అయినటువంటి విమల్ కృష్ణ దర్శకత్వం వహించలేదు. టిల్లు స్క్వేర్ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతోనే ఈ మూవీ కి కొనసాగింపగా టిల్లు క్యూబ్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టిల్లు స్క్వేర్ మూవీ కి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ "టిల్లు క్యూట్" మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మ్యాడ్ మూవీ కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ "టిల్లు క్యూట్" మూవీ కి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే డిజె టిల్లు , టిల్లు స్క్వేర్ మూవీలు మంచి విజయాలు సాధించి ఉండడంతో టిల్లు క్యూబ్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: