కొంత కాలం క్రితం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ "మ్యాడ్" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ని రూపొందించనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మార్చి 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. దానితో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఓ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ ... మ్యాడ్ స్క్వేర్ మూవీ విషయంలో కథ , లాజిక్ లను ఏ మాత్రం ఆశించి రావద్దు. వచ్చిన తర్వాత అవి సినిమాలో లేవని అనద్దు. ముందే చెబుతున్న జస్ట్ సినిమాను చూసి నవ్వుకోవడానికి మాత్రమే ఈ మూవీ కి రండి. కథ , లాజిక్ ఇలాంటివి మాత్రం సినిమాలో అసలు ఆశించకండి అని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: