మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ నటుడిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే రవితేజ ఆఖరుగా ధమాకా అనే సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఏ మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. ఆఖరుగా రవితేజ , హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆజయన్ని ఎదుర్కొంది. ఇక ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే రవితేజ ప్రస్తుతం తన తదుపరి మూవీ లకు సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రవితేజ తన తదుపరి మూవీ ని ఓ కామెడీ డైరెక్టర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మ్యాడ్ మూవీ కి దర్శకత్వం వహించి సూపర్ సక్సెస్ను అందుకున్న కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ "మ్యాడ్ స్క్వేర్" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నట్లు ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు కూడా జరుగుతున్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: