ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలలో కూలీ మూవీ ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తూ ఉండగా ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సందీప్ కిషన్ , లోకేష్ కనకరాజు ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన మా నగరం అనే సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ "మజాకా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ మంచి కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా సందీప్ కిషన్ పాత్రికేయులతో ముచ్చటించాడు. అందులో భాగంగా సందీప్ కిషన్ కు కులీ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను సాధిస్తుందా ..? మీ స్నేహితుడే కదా సినిమా చేసేది మీకు ఏమైనా అవగాహన ఉందా అనే ప్రశ్న సందీప్ కిషన్ కి ఎదురయింది.

దీనికి సందీప్ కిషన్ సమాధానం ఇస్తూ ... కచ్చితంగా కూలీ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లను అందుకుంటుంది. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను అంటే ఆ సినిమాకు సంబంధించిన 45 నిమిషాల ఫుటేజ్ ను నేను చూశాను. అది అద్భుతంగా ఉంది. అందుకే సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లను అందుకుంటుంది అని గట్టిగా చెబుతున్నాను అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఈ హీరో ఇలా చెప్పడంతో కూలీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk