తెలుగు , తమిళ్ , హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి పూజ హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా సాధించడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలం లోనే తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమెకు తెలుగులో మంచి విజయాలు దక్కలేదు. దానితో ప్రస్తుతం ఈమెకు తెలుగులో అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. దానితో ఈమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా పోయిన సంవత్సరం విడుదల కాలేదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువ శాతం తన ఇంట్రెస్ట్ ను తమిళ సినీ పరిశ్రమపై చూపిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె ఏకంగా మూడు తమిళ సినిమాల్లో నటిస్తుంది. అలాగే మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయగన్ మరియు సూర్య హీరోగా రూపొందుతున్న రెట్రో సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రజనీ కాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

ఇప్పటికే మూడు తమిళ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో కోలీవుడ్ మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... రాఘవా లారెన్స్ హీరోగా రూపొందబోయే కాంచన 4 మూవీ లో ఈ నటి హీరోయిన్గా నటించబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: