
తాజాగా ఈ బ్యూటీ మంచి మనస్సును చాటుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా తన పుట్టినరోజును జరుపుకున్న ఊర్వశి రౌతేలా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫౌండేషన్ తరపున అనాథలైన అమ్మాయిలకు సామూహిక వివాహాలను జరిపించడం ద్వారా వార్తల్లో నిలిచారు. మొత్తం 251 జంటలకు సామూహిక వివాహాలు జరిపించడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఊర్వశి రౌతేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా తర్వాత సినిమాలతో ఆమెకు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. డాకు మహారాజ్ సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత ఆసక్తికరంగా ఉండటం ఆ సినిమాకు ప్లస్ అయింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంచలన విజయం సాధించకపోయి ఉంటే మాత్రం డాకు మహారాజ్ మూవీ కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండేవని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. డాకు మహారాజ్ సక్సెస్ ఊర్వశి రౌతేలా కెరీర్ కు ఒక విధంగా ప్లస్ అయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఊర్వశిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బాలయ్య, ఊర్వశి రౌతేలా కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.